Saturday, 12 May 2012

మదర్స్ డే శుభాకాంక్షలు


 మదర్స్ డే శుభాకాంక్షలు


Your arms were always open when I needed a hug. Your heart understood when I needed a friend. Your gentle eyes were stern when I needed a lesson. Your strength and love has guided me and gave me wings to fly. 


Wednesday, 2 May 2012

మీ స్పందన కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ


మీ స్పందన కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ.....................


హలో ఫ్రిండ్స్
నేను ఇప్పుడు చెప్పబోయే సమస్య చాలా మంది పేస్ చేసే వుంటారు.
అందుకే మీ సమాధానం కావాలి.
నేను ఒక ప్రేమకధ ను చెప్తున్నాను.
మైండ్ తో కాకుండా మనసుతో ఆలోచించి సమాధానం చెప్తారు అని ఆశిస్తాను.
ఒక అమ్మాయి ,ఒక అబ్బాయి వేరు వేరు మతాలకు సంబంధించిన వాళ్ళు.
ఎంతో ప్రాణం గా ప్రేమించుకున్నారు.ఎన్నో వూసులు చెప్పుకున్నారు.ఎన్నో బాసలు చేసుకున్నారు.
జీవితం లో ఒకళ్ళకు ఒకళ్ళు తోడుగా నీడ గా బతకాలని తమని కలపమని కనిపించిన ప్రతి దైవానికి మొక్కుకునారు.
అమ్మాయి వాళ్లది సమాజం లో మంచి పేరు వున్న కుటుంబం పరువు కోసం ప్రాణం ఇచ్చే కుటుంబం.
అబ్బాయి ది వేరే మతం .పెద్దవాళ్ళు ఒప్పుకోరు. అందుకే  దూరం గా వెళ్లి రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవాలి
 అని నిర్ణయించుకున్నారు.కొంతకాలం తరువాత తెలిసిన కూడా పెద్దవాళ్ళు తప్పకుండ అంగీకరిస్తారు ఒకవేళ అంగీకరించక పోయిన
వాళ్ళకు దూరం గా తమ బతుకు తాము బతకవచ్చు అని..
ఇక్కడే వాళ్ళకి అనుకొని సమస్య ఎదురైంది...
 రిజిస్టర్డ్ మ్యారేజ్ రూల్స్....
ప్రేమించిన ఏ జంట అయిన తమ మ్యారేజ్ ప్రొసీజర్ పూర్తి అయ్యే వరకు తమ పేరెంట్స్ కి తెలియకూడదు అని కోరుకుంటుంది.
తాము పేద్దల అంగీకారం లేకుండా పెళ్లి చేసుకుంటున విషయం ముందే అందరికి తెలిసి తమవారి పరువు
పోకూడదని ముందే మ్యారేజ్ విషయం ఎవరికీ తెలియకూడదు అనే కోరుకుంటుంది.
వీళ్ళు అదే కోరుకున్నారు. ముందు మ్యారేజ్ చేసుకుని కొంతకాలం గడిచాక పేరెంట్స్ కి విషయం
తెలిస్తే అప్పుడు పెద్దవాళ్ళు కాని సమాజం కాని అంతగా అభ్యంతర పెట్టక పోవచ్చు అని అనుకున్నారు.
పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకుని రిజిస్టర్డ్ ఆఫీసులో సంప్రదించారు.
  రిజిస్టర్డ్ మ్యారేజ్ ప్రొసీజర్ తెలుసుకున్నవాళ్ళు షాక్ అయ్యారు.
 మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ పేర్లు ఒక నెల రోజులపాటు వారి వారి వూళ్ళలో  రిజిస్టర్డ్ ఆఫీసు నోటీసు బోర్డు
 మీద అతికిస్తారు అని...
 నిజం గా రూల్స్ అనేవి ప్రజలకు ఫేవర్ చేసేవిలా వుండాలే కాని వాళ్ళకు బంధాలు వేసేవిలా వుండకూడదు కదా ...
ఈ రూల్ వల్ల జరిగే ప్రయోజనం ఏంటో తెలియదు కాని ...
ఈ విధంగా బోర్డు మిద పేర్లు అతికించటం ద్వార అమ్మాయి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ తమ పరువు బోర్డు మిద
అతికించినట్లు భావిస్తారే తప్ప  తత్ఫలితంగా  తమ పిల్లల మీద ద్వేషం పెరుగుతుందే తప్ప తరగదే ?
అప్పటికప్పుడు పేరెంట్స్ ని పిలిచి  కౌన్సిలింగ్ ఇవ్వటం వల్ల వాళ్ళలో వెంటనే మార్పు వస్తుందా ?
రిజిస్టర్డ్ మ్యారేజ్ ని ఎక్కువగా చేసుకునేది ప్రేమించుకున్న వాళ్ళే కదా !
ఏ ప్రేమికులు తమ పేరెంట్స్ కి ముందుగా తెలియాలి అని కోరుకోరు కదా...
మరి ఎవరికీ ప్రయోజనం చేకూర్చని ఈ రూల్ వల్ల ప్రయోజనం ఎవరికి ?
 కాలమే  గాయానికి సరైన మందు .... కాదంటరా ?
 ప్రేమిచుకున్న వాళ్ళు తమ ప్రేమను పెద్ద వాళ్ళకు తెలిపి వల్ల అంగీకారం కోసం ఎంతగానో వేడుకుంటారు
అప్పుడు రాని మార్పు అధికారులు  కౌన్సిలింగ్ ఇవ్వటం వల్ల వస్తుందను కోవటం కరెక్ట్ నా ?
పైగా ఇంట్లో వుండే మనల్ని ఇలా వీధిలోకి లాగారు అనే కోపం కలుగుతుంది .
ప్రభుత్వం అలోచించి ఇలాంటి రూల్స్ తొలగిస్తే ఎంతో మంది ప్రేమికులకి ప్రయోజనం జరుగుతుంది .
వాళ్ళు ఒకళ్ళను విడిచి ఒకళ్ళు బతకలేక తల్లితండ్రుల పరువు నోటీసు బోర్డు మీద పెట్టలేక
తమ భవిష్యత్తును భగవంతుడికి అప్పగించి నరకయాతన అనుభవిస్తున్నారు.
నిజంగా ఆ భగవంతుడే వారికి మార్గం చూపించాలి అని కోరుకుంటూ....







Wednesday, 17 August 2011

తన స్వార్ధం కోసం ఆ అమ్మాయి ఆడిన "ప్రేమ నాటకం"


ఇంత కాలం అబ్బాయి లే అమ్మాయి లను మోసం చేసే వాళ్ళు అని మనం పేపర్ లో ,న్యూస్ లో చదివేవాళ్ళం. కాని
ఈ మధ్య "కొందరు" అమ్మాయి లు అబ్బాయి లను సైతం మించిపోతున్నారు.నేను ఇంతవరకు సినిమా లోనే ఇలాంటి అమ్మాయి లను,పేరెంట్స్ ని చూసాను.కాని ఇప్పుడు నిజజీవితం లో ఒక అమ్మాయి ని చూసాను.నిజంగా ఆ అమ్మాయి ని ఏమనాలో మీరే చెప్పండి.
ఒక అమ్మాయి ఆనందం గా సాగిపోతున్న ఒక అబ్బాయి జీవితాన్ని నాసనం చేసింది.
తన స్వార్ధం కోసం ఆ అమ్మాయి ఆడిన "ప్రేమ నాటకం" లో తను బలిపసువయ్యాడు.
ఆ అబ్బాయి కి ఎన్నో తీపి కబుర్లు చెప్పింది."నువ్వు లేకపొతే నేను బతక లేను " 
"నువ్వు అన్నం తిన్నావు అని నాకు ఫోన్ చేసి చెప్తే గాని నేను తినను అని "
"చావైన బతుకైన నితోనే అని " ప్రమాణాలు చేసింది.
"తన ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోరు అందుకే సుసైడ్ చేసుకోవాలి అనుకునన్నాను అని హాస్పిటల్ లో జాయిన్ అయి" మరీ ఆ అబ్బాయి ని నమ్మించింది.
ఈ నాటకాని కి సూత్రదారి ఆ అమ్మాయి వాళ్ళ "అమ్మ",పాత్రదారి కూడా అనుకోండి.ఆ అమ్మాయి కి హెల్త్ బాగా లేక హాస్పిటల్ జాయిన్ అయితే తన కూతురు ఆత్మహత్య యత్నం చేసింది అని ఆ అబ్బాయి కి చెప్పి హాస్పిటల్ కి పంపించింది ఆ అమ్మాయి వాళ్ళ అమ్మే.
పైకి ఆ అబ్బాయి తో తన కూతురు చనువు గా మాట్లాడటం ఇష్టం లేనట్లు గానే నటిస్తూ,తన కూతురి ద్వారా ఆ అబ్బాయి ని తాము
కష్టాలలో వున్నాం అని ఆ అబ్బాయి దెగ్గర డబ్బులు అడిగించింది.ప్రేమ గుడ్డిది అంటారు కదా! ఆ అమ్మాయి మాటలను గుడ్డిగా నమ్మిన
అతను తన దెగ్గర అంత మొత్తం లేకున్న అప్పు చేసి మరి అక్షరాల లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ ని ఆదుకున్నాడు.ఆ అమ్మాయి ని రోజు బైక్ మిద తనే ఆఫీసు కి తీసుకెళ్ళేవాడు.ఇంటికి తీసుకోచేవాడు.
ఒక రోజు ఎప్పటిలాగే ఆ అమ్మాయి ని ఆఫీసు దెగ్గర నుండి తీసుకుని రావటానికి అతను ఆ అమ్మాయి ఆఫీసు కి వెళ్ళాడు.
ఆ అమ్మాయి వేరొకఅబ్బాయి బైక్ ఎక్కి వెళ్ళటాన్ని చూసిన ఆ అబ్బాయి ఆ అమ్మాయి ని అడిగాడు ఆతను ఎవరు అని.
అంతే అతనికి తలతిరిగిపోయే సమాధానం చెప్పింది ఆ అమ్మాయి.
 ఆ అబ్బాయి తనకు కాబోయే భర్త అని ,మా పేరెంట్స్ కూడా పెళ్ళికి ఒప్పుకునారు అని,ఇంకా నువ్వు నన్ను రోజు బైక్ మిద డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు ,నా కాబోయే భర్తే నన్ను బైక్ మిద డ్రాప్ చేస్తాడు.రేపు నువ్వు 
ఇదే టైం కి మా ఆఫీసు దెగ్గరికి వస్తే నా కాబోయే భర్తకు నిన్ను పరిచయం చేస్తాను. ఇంకెప్పుడు తనతో మాట్లాడటానికి ప్రయత్నించవద్దు
అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది.
ఆ అమ్మాయి ఇచ్చిన షాక్ నుండి ఇంకా ఆ అబ్బాయి తేరుకోలేక పోతున్నాడు.పిచ్చి పట్టిన వాడిలా తాయారు అయ్యాడు.
నిజం గా అతని ని చూస్తె చాల బాధ గా అనిపించి ఈ విషయం మీతో చెప్పాలి అనిపించింది.నాకు ఆ అమ్మాయి చేసిన తప్పు కన్నా
ఆ అమ్మాయి ని అలా చెయ్యమని చెప్పిందే వాళ్ళ అమ్మ ఆవిడను ఏమనాలో అర్ధం కావటం లేదు.
ఎందుకు కొందరు  మనుషులు ఇంత కర్కశం గా ఆలోచిస్తున్నాడు.తమ స్వార్ధం కోసం ఇంకొకరికి ఎంతటి కష్టాన్ని ఐన తలపెట్టటానికి కూడా ఎందుకు  వెనకాడటం లేదో అర్ధం కావటం లేదు.
ఈ మధ్య కాలం లో ప్రేమ పేరు తో అబ్బాయి లు అమ్మాయి లను మోసం చేయటం అబ్బాయి లు అమ్మాయి లను
మోసం చెయ్యటం జరుగుతూ వున్నాయి.ఒక మనిషి ఎదుటి మనిషిని మోసం చేసేటప్పుడు వాళ్ళు కూడా తమలాంటి వాళ్ళే అని వాళ్ళకి కూడా తమలాగే హృదయం వుంటుంది అని తమకు
 చిన్న కష్టం వచ్చిన తట్టుకోలేమే ... అటువంటిది మనం ఎదుటివాళ్ళ కి
 అంతటి కష్టాన్ని ఎలా ఇవ్వగలము అని ఎందుకు ఆలోచించరు ?
నేను చెప్పాలి అనుకున్నది ఒకటే.....
మనం కాళ్ళకు వేసుకునే షూ దెగ్గర నుండి తలకు పీతుకునే క్యాప్ వరకు చాల జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటామే......
అటువంటిది మనం జీవితాంతం కలిసి బతకాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకునే విషయం లో కొంచం జాగ్రత్త తీసుకుంటే లైఫ్ హ్యాపీ
గా సాగిపోతుంది .కదూ........

Monday, 15 August 2011

నిర్లక్ష్యం ఖరీదు నిండు" ప్రాణం"


నిర్లక్ష్యం ఖరీదు నిండు" ప్రాణం"


ఒక నిండు ప్రాణం  విలువ  బహుసా ఒక డాక్టర్ కంటే ఎక్కువ ఎవరికీ తెలుస్తుంది చెప్పండి ?
మనం దేవుడి  తరువాత అంతగా  నమ్మి మన ప్రాణాలను అప్పగించేది ఒక డాక్టర్ కే.
నీదే  భారం తల్లీ ... నా బిడ్డను బతికించు డాక్టరమ్మ  అని ఆ తల్లీ ఆ డాక్టర్ ను  దినం గ వేడుకుంది.
తన బిడ్డ అల్లాడి పోతుంది అని అక్కడ వున్న నర్సులను ప్రాధేయ పడింది ఆలస్యం ఐతే తన బిడ్డ తమకు దక్కదేమో అని......
ముగ్గురు  చిన్నారులు తల్లీ లేని అనాధలు అయిపోతారు కొంచం వచ్చి తన బిడ్డ పరిస్థితి ని చూడండి అని వేడుకుంది...
ఎం కాదు ఇది మామూలే .... అని అందరు నిమ్మకు నిరెత్తినట్లు వూరుకుంది పోయారు.
పరిస్థితి చైదాటింది.తీవ్రమైన రక్తస్రావం తో ఆ బాలింత అల్లాడి పోయింది.అంత అయిపోయిన తరువాత నెమ్మది గ వచ్చిన
డాక్టరమ్మ ఇక్కడ కాదు పెద్ద హాస్పిటల్ కి తెసుకెళ్ళమని ఒక ఉచితసలహా పడేసి వెళ్లిపోయింది.ఆ అమ్మాయి తల్లీతండ్రులు
పెద్ద హాస్పిటల్ లో చేర్చారు. అప్పుడు అక్కడి డాక్టర్స్ చెప్పారు ఆపరేషన్ లో జరిగిన నిర్లక్ష్యం కారణం గా ఆ అమ్మాయి కి ఇలా జరిగింది అని.
ఆ అమ్మాయి చనిపాయింది.
తన మిద కేసు పెట్ట కుండ ఆ డాక్టరమ్మ ఆ అమ్మాయి తల్లీ తండ్రులకి  కొంత మొత్తం ఇస్తాను అని బేరం పెట్టి చివరకు తన మిద కేసు లేకుండా
చేసుకోగలిగింది.
ఇక్కడ రెండు హక్కులు ఆ అమాయకురాలి నుండి హరిపబడ్డాయి.
ఒకటి జీవించేహక్కు..... మరొకటి 
తనకు జరిగిన అన్యాయానికి న్యాయం పొందే హక్కు.......
ఆ డాక్టర్ నిర్లక్ష్యాని కి ఒక తల్లీ తన బిడ్డను పోగొట్టుకుంది.
ముగ్గురు చిన్నారులు తన తల్లీ ని పోగొట్టుకున్నారు.
ఈ మధ్య కాలం లో మనం ఇలాంటివి పేపర్ లో తరచూ చూస్తూ వున్నాం.
నార్మల్ డెలివరి అయ్యే పరిస్దితులు వున్నా కూడా కొంతమంది డాక్టర్స్ డబ్బు ఆశలో ఆపరేషన్ చేసి అది వికటించి
చాల మంది అమాయక మహిళలు తమ ప్రాణాలు కోల్పోతునారు అని...
ఎంతో విజ్ఞానవంతులైన డాక్టర్స్ ఏ తమ విధిని మరిచి ఈ విధం గా చేస్తూవుంటే ఇంకా సామాన్యుల కు న్యాయం జరిగేది ఎలా ?









అందరికి స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు

అందరికి స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు

ఈ ఫోటో ని చూస్తుంటే ఎం అనిపిస్తుంది ?


Friday, 22 July 2011

పెంపుడుతల్లి చేతిలో జీవితాన్ని కోల్పోయిన కూతురు !



ఒక మహాతల్లి కి పిల్లలు పుట్టక పోవటం తో బంధువుల పాప ని దత్తత తీసుకుని పెంచుకుంది .
కూతురి కి ఒక మంచి అబ్బాయి ని వెతికి మరీ పెళ్లిచేసింది.రెండేళ్లు వాళ్ళ కాపురం చాలా సంతోషం గా సాగింది.వీరికి ఒక పాప కూడా పుట్టింది.
కాని ఆ అమ్మాయి కలలో అయిన వూహించి వుండదు ఏమో !ఆ అమ్మాయి నే కాదు బహుసా సభ్యసమాజం లో వున్న ఎవరు కుడా అలా వుహించరు ఏమో!
ఆ అమ్మాయి కాపురం మిద ఒక మహిళ కన్ను పడింది.ఆ అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేసి,ఆ అమ్మాయి భర్తను కూడా శాశ్వతం గా తనతో తీసుకుని
వెళ్ళింది.
ఆ అమ్మాయి కాపురం మిద కన్నేసి ఆ అమ్మాయి బతుకును చిద్రం చేసిన ఆ రాక్షసి ఎవరు అనుకుంటున్నారా ?
ఎవరో కాదు ఆ మహాతల్లే!
ఎక్కడో తన తల్లితండ్రుల వద్ద హాయి గా పెరుగుతున్న ఆ అమ్మాయి ని తనకు పిల్లలు లేరు అని చెప్పి ఆ అమ్మాయి తల్లితండ్రులను ఒప్పించి దత్తత
తీసుకుని ఇన్నేళ్ళు పెంచి పెద్ద చేసి ,పెళ్లి చేసి,చివరకు కొడుకుల చూసుకోవాల్సిన అల్లుడితో నే అక్రమసంబంధం పెట్టుకుని తన కూతురి జీవితాన్ని నాశనం చేసింది.
ఈ విషయం ఆ నోట ఈ నోట ఆ కూతురికి తెలియటం తో ఆ కూతురు పెంపుడు తల్లి ని నిలదీసింది.దాంతో ఆ పెంపుడు తల్లి ,కూతురి జీవితం ఏమై పోతుందో
అనే కనీసఆలోచన లేకుండా అల్లుడి ని తనతో పాటు తీసుకుని వెళ్లి తనతో పాటు అల్లుడి కి కూడా విషం తాగించి తను తాగి చనిపాయింది.
ఇప్పుడు పెంపుడుతల్లి చేతిలో అన్యాయం అయిన ఆ కూతురు నిండు గర్భిణి.ఒక పక్క పెంచి పెద్ద చేసిన తల్లి,మరోపక్క భర్త శవాలను చూస్తూ ఆ అమ్మాయి 
విలపిస్తున్న తీరు చూస్తే ఎంతటి పాషాణ హ్రుదయులకు అయిన కన్నిరు రాక మానదు.
నిజంగా ఈవిడకు భగవంతుడు బహుసా ఇందుకే పిల్లల ను ఇవ్వలేదేమో!
ఇలాంటి సంఘటనలను చూసినపుడు ఇంకా ముందు ముందు సమాజం లో బంధాలు ఎలా మారుతాయో అనే భయం కలుగుతూవుంటుంది కదా ?
నిజం గా  ఆ అమ్మాయి పరిస్దితి ని తలచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది.ఇలాంటి కష్టం ఇంకా ఏ అమ్మాయి కి కూడా రాకూడదు.

Sunday, 17 July 2011

ఇదెక్కడి న్యాయం?

ఒక ప్రాంతం రాజకీయనాయకుడు చేసిన కామెంట్స్ కి ఫలితం ఈ ప్రాంతం లో వున్న ఆ ప్రాంతప్రజల పై దాడులు జరుగుతాయి అని ఒక  రాజకీయనాయకుడు
అనటం ,గతం లో కూడా ఇలా ఆ ప్రాంతప్రజలపై దాడులు జరిగిన విషయాన్నీ మరొక  రాజకీయ నాయకుడు గుర్తు చెయ్యటం ఇదెక్కడి న్యాయం.
ఏ తప్పు చెయ్యని సామాన్యులకు శిక్ష పడుతుంది అనటం ధర్మమా ?
ఎంతో విజ్ఞత కల రాజకీయ నాయకులు ఈ విధం గా మాట్లాడటం భావ్యమా ?
ఏ క్షణం ఏ రాజకీయ నాయకులు ఎలాంటి కామెంట్స్ చేస్తారో ? దాని ఫలితం ఏ విధంగా వుంటుందో.ఎవరిమీద పడుతుందో అని ప్రజలు భయపడుతూ
బిక్కుబిక్కుమంటూ బతికేరోజుల నుండి విముక్తి ఎప్పుడు లభిస్తుందో కదా!